Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

నాలుగు రోజుల్లోనే రూ.400 కోట్ల క్లబ్‌లోకి రజనీ.. ఓవర్సీస్‌లో ‘ధురంధర్‌ 2’ రికార్డు బద్దలు!

Rajinikanth enters 400 crore club in four days breaking Dhurandhar 2 overseas record
Advertisement
  • ఆదివారం భారత్‌లో రూ.55.85 కోట్ల నెట్‌ కలెక్షన్లు
  • ఓవర్సీస్‌ తొలి రోజు వసూళ్లలో ‘ధురంధర్‌ 2’ను అధిగమించిన జైలర్‌ 2
  • విదేశీ మార్కెట్లో తొలి రోజు రూ.57 కోట్లు
  • తమిళ వెర్షన్‌ ఆదివారం రూ.39.95 కోట్లు వసూలు
  • తెలుగు వెర్షన్‌ రూ.9.50 కోట్ల వసూళ్లు
Advertisement
సూపర్‌స్టార్‌ రజనీకాంత్‌ నటించిన ‘జైలర్‌ 2’ బాక్సాఫీస్‌ వద్ద దూసుకెళ్తోంది. విడుదలైన నాలుగు రోజుల్లోనే ప్రపంచవ్యాప్తంగా రూ.424.25 కోట్ల వసూళ్లు సాధించింది. దీంతో రూ.400 కోట్ల క్లబ్‌లోకి అడుగుపెట్టింది. మరోవైపు 2026లో భారతీయ సినిమాల్లో ఓవర్సీస్‌ తొలి రోజు అత్యధిక వసూళ్లు సాధించిన చిత్రంగా నిలిచింది. ఈ క్రమంలో రణ్‌వీర్‌ సింగ్‌ నటించిన ‘ధురంధర్‌ 2’ను వెనక్కి నెట్టింది.

ఆదివారం ఒక్కరోజే ‘జైలర్‌ 2’ భారత్‌లో రూ.55.85 కోట్ల నెట్‌ వసూళ్లు సాధించింది. శనివారం వచ్చిన రూ.47.25 కోట్లతో పోలిస్తే ఆదివారం వసూళ్లు 18.2 శాతం పెరిగాయి. విడుదలైన తొలి రోజు రూ.59.70 కోట్లు రాబట్టిన ఈ చిత్రం.. రెండో రోజు రూ.37.10 కోట్లకు పరిమితమైంది. ఆ తర్వాత వారాంతంలో మళ్లీ పుంజుకుంది.

ఇప్పటివరకు భారత్‌లో ఈ సినిమా నెట్‌ వసూళ్లు రూ.199.90 కోట్లకు చేరాయి. పన్నులతో కలిపిన దేశీయ వసూళ్లు రూ.234.25 కోట్లు కాగా.. విదేశాల్లో రూ.190 కోట్లు రాబట్టింది. దీంతో ప్రపంచవ్యాప్త వసూళ్లు రూ.424.25 కోట్లకు చేరినట్లు ట్రేడ్‌ అంచనాలు చెబుతున్నాయి.

ఓవర్సీస్‌లోనూ రజనీ జోరు
విదేశీ మార్కెట్లో తొలి రోజు వసూళ్లలో ‘జైలర్‌ 2’ సుమారు రూ.57 కోట్లు సాధించింది. ‘ధురంధర్‌ 2’ తొలి రోజు రాబట్టిన రూ.52 కోట్లను అధిగమించింది. ఈ జాబితాలో రామ్‌చరణ్‌ నటించిన ‘పెద్ది’ రూ.28 కోట్లతో మూడో స్థానంలో ఉంది. విజయ్‌ ‘జన నాయగన్‌’ రూ.27.50 కోట్లు, మలయాళ చిత్రం ‘దృశ్యం 3’ రూ.25 కోట్లతో తర్వాతి స్థానాల్లో నిలిచాయి.

తమిళ వెర్షన్‌ హవా
ఆదివారం వసూళ్లలో తమిళ వెర్షన్‌ అగ్రస్థానంలో నిలిచింది. ఈ భాషలో రూ.39.95 కోట్ల నెట్‌ వసూళ్లు వచ్చాయి. తెలుగు వెర్షన్‌ రూ.9.50 కోట్లు, హిందీ వెర్షన్‌ రూ.5.75 కోట్లు, కన్నడ వెర్షన్‌ రూ.65 లక్షలు రాబట్టాయి. అన్ని భాషల్లో కలిపి 15,473 ప్రదర్శనలకు సగటున 62 శాతం ఆక్యుపెన్సీ నమోదైంది.

నాలుగు రోజుల్లోనే భారీ వసూళ్లు సాధించిన ‘జైలర్‌ 2’కు ఇప్పుడు అసలు పరీక్ష మొదలుకానుంది. వారాంతపు జోరును వారం మధ్యలోనూ కొనసాగిస్తుందా? అనేది ఆసక్తికరంగా మారింది.
Advertisement
Advertisement
Rajinikanth
Jailer 2 Box Office
Jailer 2 400 Crore Club
Jailer 2 Overseas Collection
Dhurandhar 2 Record Broken
Jailer 2 Worldwide Collection

More Telugu News